PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్రమ నాటుసారా, మద్యం పై విస్తృత దాడులు : ఎస్పీ

1 min read

పల్లెవెలుగు వెబ్​:అక్రమంగా నాటుసారా తయారీ, నిల్వ, రవాణా అమ్మకాలు , అక్రమ మద్యం రవాణా , అమ్మకాలపై గత వారం రోజులుగా జిల్లా పోలీసు యంత్రాంగం, సెబ్ అధికారులు, స్పెషల్ పార్టీ పోలీసులు,  సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించి విస్తృతంగా దాడులు చేశారని  జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్ గారు మంగళవారం ఒక ప్రకటనలో వివరాలను విడుదల చేశారు.  జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా నాటుసారా నిర్మూలనకు జిల్లా పోలీసులు  సమిష్టిగా నాటుసారా స్థావరాలపై విస్తృతంగా దాడులు నిర్వహించడం జరిగిందన్నారు.  నాటుసారా తయారుచేసే 21 గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు.

విస్తృత దాడులలో గత వారం రోజులుగా …

1. నాటుసారా పై విస్తృతంగా దాడులు.

నాటుసారా పై  25  కేసులు,  28 మంది అరెస్టు , 253 లీటర్ల నాటుసారా  సీజ్ ,  1,430  లీటర్ల నాటు సారా బెల్లం ఊటను ధ్వంసం ,  36  కేజీల బెల్లం సీజ్  , 4  వాహనాలు  సీజ్ చేయడం జరిగింది.

2.         అక్రమ(తెలంగాణ, కర్ణాటక) మద్యం రవాణ పై దాడులు…

అక్రమ మద్యం పై  53  కేసులు,   54 మంది అరెస్టు , 519 . 8 లీటర్ల  మద్యం  సీజ్, 9   వాహానాలు సీజ్.

3. బైండ్ ఓవర్ కేసుల వివరాలు…

నాటు సారా  పై  5  మందిని బైండోవర్ చేయడం జరిగింది.

అక్రమ మద్యం పై   5 మంది ని బైండ్ ఓవర్  చేయడం జరిగింది.

షరతులను ఉల్లంఘించిన 6 మంది (BREACH OF BOND)  పై  బాండ్‌లు జప్తు చేసి రూ. 85, 000 జరిమానా విధించడం జరిగింది. ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజనాకు జమ చేయడం జరిగింది. నాటుసారా పై విస్తృతంగా గ్రామాలలో ఆర్ ఎస్సై , 12 మంది స్పెషల్ పార్టీ పోలీసులచే దాడులు చేస్తున్నామన్నారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే అక్రమ నాటుసారా తయారీ ,  అక్రమంగా మద్యం  రవాణా,  విక్రయాలకు పాల్పడే వ్యక్తులపై పిడి యాక్టులు కూడా నమోదు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్  గారు ఈ సంధర్బంగా తెలిపారు.

About Author