PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈనెల 27 నుంచి ఏపీలో భారీ వర్షాలు

1 min read


పల్లెవెలుగు వెబ్: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ నెల 27 నుంచి ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రధానంగా నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

About Author