‘అతనికి’ వితంతు ఫించన్..!
1 min readపల్లెవెలుగు వెబ్: కర్నూలు జిల్లాలో వింత చోటుచేసుకుంది. పురుషుడికి వితంతు ఫించను జారీ చేశారు. అధికారుల నిర్వాకమే కారణమని అంటున్నారు. ఈ విషయం తెలిసినవారంతా నవ్వుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో ఉద్యోగల పనితీరుకు ఇది అద్ధంపడుతుందని విర్శిస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్ మండంలో ఈ వింత విషయం జరిగింది. డోన్ మండలంలోని ఎద్దుపేటలో ఈ విషయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. గ్రామానికి చెందిన కాశీం అనే వ్యక్తికి వితంతు ఫించను జారీ అయ్యింది. కాశీం ఈ విషయాన్ని గమనించలేదు. కాశీం గుంటూరు జిల్లా వినుకొండకు ఉపాధి నిమిత్తం వెళ్లారు. అక్కడ ఫించను తీసుకునేందుకు స్థానిక అధికారుల దగ్గరికి వెళ్లారు. అయితే.. అక్కడి అధికారులు ఈ విషయాన్ని గుర్తించారు. కాశీం పేరు మీద జారీ అయ్యింది వితంతు ఫించను అని చెప్పారు. ఈ విషయాన్ని డోన్ మండల అధికారులకు వివరించారు. ఇప్పుడు అధికారులు ఆ తప్పును సరిదిద్దుకునే పనిలో పడ్డారు.