PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొహ్లీ ఆట పై భార్య అనుష్క భావోద్వేగం !

1 min read

పల్లెవెలుగువెబ్ : తన భర్త చేసిన అద్భుతానికి కోహ్లీ భార్య అనుష్క శర్మ పొంగిపోతోంది. మ్యాచ్ ను టీవీలో చూసిన ఆమె విరాట్ను పొగుడుతూ ఇన్ స్టాగ్రామ్ లో భావోద్వేగ పోస్ట్ చేసింది. ‘విరాట్.. దీపావళి ముంగిట ఈ రాత్రి ప్రజల జీవితాల్లో చాలా ఆనందాన్ని తెచ్చావు. నువ్వెంతో అద్భుతమైన వ్యక్తివి. నీ పట్టుదల, సంకల్పం, నమ్మకం ప్రతి గుండెను కదిలించాయి. నా జీవితంలో అత్యుత్తమ మ్యాచ్‌ని ఇప్పుడే చూశానని గర్వంగా చెబుతున్నా. మ్యాచ్ చూస్తున్నప్పుడు నేను గదిలో గట్టిగా అరుస్తూ ఎగిరి గంతేశా. నేను అలా ఎందుకు చేస్తున్నానో మన చిన్నారి పాపకు అర్థం కాలేదు. కానీ, ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత బలంగా తిరిగొచ్చి తన తండ్రి అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని ఏదో రోజు ఆమె అర్థం చేసుకుంటుంది. నిన్ను చూసి నేను ఎంతో గర్వపడుతున్నా. నున్వే నా బలం. నా జీవితం. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను’ అని అనుష్క శర్మ పోస్ట్ చేసింది.

About Author