పెళ్లిలో ఊడిన విగ్గు.. ఆగిన పెళ్లి !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్‌కు సమీపంలోని రెండు గ్రామాలకు చెందిన యువతి యువకులకు పెళ్లి నిశ్చయమైంది. అయితే తనకు బట్టతల ఉందనే విషయాన్ని యువకుడు దాచి పెట్టాడు. పెళ్లి చూపులకు విగ్గుతో వచ్చాడు. పెళ్లి పీటలు ఎక్కే వరకు బాగానే విగ్గును మేనేజ చేశాడు. కానీ తీరా పెళ్లి తంతు జరుగుతుండగా జయమాల వేడుక అనంతరం మండపంలోకి వరుడు రావాల్సి ఉంది. అయితే అదే సమయంలో అతడు స్పృహ తప్పి పడిపోయాడు. అతడిని లేపే ప్రయత్నంలో తలపాగా తీయగా విగ్గు ఊడిపోయింది. ఇది చూసి వధువు, ఆమె బంధువులు నిర్ఘాంతపోయారు. బట్టతల విషయం దాచారంటూ ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగింది. బట్టతల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకునే సమస్యే లేదని వధువు కుండబద్దలు కొట్టేసింది.