PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైల్డ్ డాగ్ మూవీ రివ్యూ

1 min read

సినిమా: వైల్డ్ డాగ్
న‌టీన‌టులు: అక్కినేని నాగార్జున‌, దియా మీర్జా, స‌యామి ఖేర్, అతుల్ కుల‌క‌ర్ణి, అనిష్ కుర‌విల్ల
ద‌ర్శక‌త్వం: ఆశిషోర్ సాల్మన్
సంగీతం: త‌మ‌న్
సినిమాటోగ్రఫి: షానిల్ డియో
నిర్మాణ సంస్థ: మ్యాట్నీ ఎంట‌ర్ టైన్మెంట్స్
నిర్మాత‌లు: ఎస్ నిరంజ‌న్ రెడ్డి, కె. అన్వేష్ రెడ్డి

అక్కినేని నాగార్జున కొత్త క‌థ‌ల‌ను ప్రోత్సహించ‌డంలో ముందుంటాడు. రొటీన్ కు భిన్నంగా.. మూస‌ప‌ద్ధతికి దూరంగా..ఒక ప్రయోగాత్మక క‌థ‌ల‌ను తెలుగు తెర‌మీదికి తీసుకురావ‌డంలో ప్రతిసారి త‌న మార్కుప్రయ‌త్నాన్ని చేస్తుంటాడు. వైల్డ్ డాగ్ లో కూడ అలాంటి ప్రయ‌త్నమే చేశాడు. ఇదొక వాస్తవ క‌థ‌నాల స్పూర్తితో తీసిన సినిమా.

క‌థ‌:
జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారి విజ‌య‌వ‌ర్మ పాత్రలో నాగార్జున న‌టించారు. ఎన్కౌంటర్ స్పెష‌లిస్టు అనే పేరు ఉంటుంది. 2006 నుంచి 2013 వ‌ర‌కు ఇండియాలో జ‌రిగిన బాంబు పేలుళ్లకు కార‌ణ‌మైన ఇండియ‌న్ ముజాహిదీన్ అనే ఉగ్రవాద సంస్థకు చెందిన కీల‌క‌మైన ఉగ్రవాదిని ప‌ట్టుకోవ‌డం కోసం ఒక ఆప‌రేష‌న్ జ‌రుగుతుంది. విజ‌య‌వ‌ర్మ బృందం ఆ ఆప‌రేష‌న్ జ‌రిగే క్రమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొటుంది. ఈ ఆప‌రేష‌న్ లో స‌క్సెస్ అయ్యారా? లేదా ? అన్నది తెర మీదే చూడాలి.
విశ్లేష‌ణ‌: విజ‌య వ‌ర్మ పాత్రలో నాగార్జున న‌ట‌న చాలా రియ‌లిస్టిక్ గా ఉంటుంది. బాంబు పేలుళ్ల బాధితుడిగా.. ఎన్ఐఏ అధికారిగా చాలా చ‌క్కగా న‌టించారు. ద‌ర్శకుడు ఆశిషోర్ సాల్మన్​ బాంబ్ బ్లాస్ట్ నేప‌థ్యంలో జ‌రిగిన స‌న్నివేశాల‌ను ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించారు. పాత క‌థ అయిన‌ప్పటికి .. చిత్రంలో ఎక్కడా విసుగు క‌ల‌గ‌దు. ఆద్యంతం ఆస‌క్తి తో కూడిన స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించారు. మొద‌టి పార్ట్ లో సెంటిమెంట్ ను పండించిన‌ప్పటికీ.. రెండో పార్ట్ లో యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఆస‌క్తిక‌రంగా కూడ ఉంటాయి. రెండో పార్ట్ లో రా ఏజెంట్ పాత్రలో ప్రవేశించిన స‌యామి ఖేర్.. ఎంట్రీ ఆస‌క్తి క‌లిగిస్తుంది. స‌యామి ఖేర్ న‌ట‌న సినిమాకి ప్లస్ అయింద‌ని చెప్పవ‌చ్చు. సినిమాలో స‌యామి ఖేర్ పాత్ర చాల కీల‌కంగా ఉంటుంది. త‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఉంది. సినిమాటోగ్రఫీ ప‌ర‌వాలేదు. సినిమాలో పాట‌లు లేవు.
ముగింపు: ఒక ఉగ్రవాదిని ప‌ట్టుకునే క్రమంలో అధికారుల త్యాగాలు, పోరాటాన్ని చ‌క్కగా తెర‌కెక్కించిన‌ప్పటికీ.. సినిమాలో ప్రతి స‌న్నివేశం ఎక్కడో చూసిన‌ట్టుగా స‌గ‌టు ప్రేక్షకుడికి అనిపిస్తుంది. చాలా సినిమాల్లో ఇలాంటి స‌న్నివేశాలు ఉన్నాయి. ఈ విష‌యంలో ద‌ర్శకుడు జాగ్రత్త ప‌డి ఉంటే బాగుండేది. కానీ .. చిత్రంలో రెండో పార్ట్ లో వ‌చ్చే ట్విస్టులు ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. చిత్రంలో ఎక్కడా బోర్ కొట్టకుండా ద‌ర్శకుడు జాగ్రత్త ప‌డ్డాడ‌ని చెప్పవ‌చ్చు. సినిమా చూడ‌వ‌చ్చు.

గ‌మ‌నిక‌: ఈ రివ్యూలోని అభిప్రాయం స‌గ‌టు ప్రేక్షకుడిగా మాత్రమే రాయ‌డం జ‌రిగింది.

About Author