విచ్చలవిడిగా అటవీ జంతువుల మాంసం విక్రయాలు..?
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: విచ్చలవిడిగా అటవీ జంతువుల మాంసాన్ని విక్రయిస్తున్నట్లు? విశ్వాసనీయ సమాచారం. జంతువును బట్టి 300 రూపాయలు నుండి 500 రూపాయల వరకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తుంది. అటవీ శాఖలోని తాత్కాలికి సిబ్బంది ఒకరిద్దరు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా అడవి జంతువులు నీటి కోసం బయటికి వస్తాయని ఆ ప్రాంతాన్ని గుర్తించి ఉచ్చులు లేదా విద్యుత్ ద్వారా వాటిని చంపి వాటి మాంసాన్ని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అటవీ అధికారులు సంబంధిత వ్యక్తులను గుర్తించి అదుపులోనికి తీసుకొని విచారించి వదిలివేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అందులో పనిచేసే తాత్కాలిక ఉద్యోగి ఒకరిద్దరు హస్తం ఉందన్న భావనతోనే వదిలేసినట్లు తెలుస్తుంది. విద్యుత్ ద్వారా అడవి జంతువులను చంపడానికి వినియోగించే కొన్ని కర్రలు బయటపడ్డట్లు తెలుస్తుంది. మహానంది మండలమే కాక ఆనుకొని ఉన్న ప్రక్క మండలాల గ్రామాలకు కూడా రహస్యంగా సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి .