వన్యప్రాణుల సంరక్షణ.. అందరి బాధ్యత :డిఎఫ్ఓ
1 min readపల్లెవెలుగు వెబ్ ,ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారంజిల్లా అటవీ శాఖ కార్యాలయం రేంజర్ కృష్ణ కుమార్ ఆధ్వర్యంలో వారోత్సవాల ముగింపు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎఫ్ఓ యశోధభాయ్ మాట్లాడుతూ వన్యప్రాణి సంరక్షణ ప్రతిఒక్కరూ బాధ్యతగా భావించాలన్నారు. వన్యప్రాణుల అభివృద్ధికి కృషి చేయాలి పిలుపునిచ్చారు వన్యప్రాణి అధికారి కృష్ణకుమార్. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు వన్యప్రాణి సంరక్షణ పై నిర్వహించిన పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలను.బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డిఎఫ్ఓ సెల్వం, బీట్ ఆఫీసర్లు గంగారత్నం, అశోక్ కుమార్ మరియు పలువురు అటవీ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.