జులై 26న సీబీఐ కోర్టులో.. అన్ని విషయాలు తేలుతాయి ?
1 min read
పల్లెవెలుగు వెబ్ : నేరచరిత్ర గల ఇద్దరు వ్యక్తులు తనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. 42 వేలకోట్ల అక్రమాలపై అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి తనపై ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. జులై 26న సీబీఐ కోర్టులో అన్ని విషయాలు తేలుతాయన్నారు. దొంగలంతా కలిసి తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తనపై తమిళనాడులో కేసు నమోదవ్వడానికి సీఎం జగన్, ఎంపీ బాలశౌరి కారణమని రఘురామ అన్నారు. తన గురించి అన్నీ తెలిసి టికెట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.