వినియోగదారులకు అమెజాన్ షాక్ ఇవ్వనుందా ?
1 min readపల్లెవెలుగువెబ్ : యూజర్లకు ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ షాకివ్వనుంది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, ఫ్యూయల్ కాస్ట్ పెరగడం, ట్రాన్స్పోర్ట్ ఖర్చులతో పాటు వేర్ హౌస్ షార్టేజ్ వంటి కారణాల్ని చూపిస్తూ కొన్ని దేశాల్లో అమెజాన్ ప్రైమ్ ధరల్ని 43శాతం వరకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే అమెజాన్ ప్రైమ్ ధరలు భారీగా పెరగనున్నాయి. పలు నివేదికల ప్రకారం.. అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ధరల్ని పలు దేశాల్లో భారీగా పెరగనున్నాయి. పెరగనున్న దేశాల్లో భారత్ లేకపోవడంపై యూజర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా ఏడాది కాలం పాటు పెరగనున్న సబ్ స్క్రిప్షన్ ధరలు ఒక్కసారి చూస్తే ఫ్రాన్స్‌లో 43శాతం, ఇటలీలో 49.90శాతం, స్పెయిన్‌లో 39శాతం, యూకేలో 95శాతం, జర్మనీ లో 89.90 శాతం వరకు ఉండనున్నాయి.