NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అందుబాటులో ఉంటా… సేవ చేస్తా..

1 min read

ఆదోని కూటమి అసెంబ్లీ అభ్యర్థి డా. పార్థసారధి

  • ఘనాపాటి నేతల సమక్షంలో కూటమి పార్టీ ప్రారంభం

ఆదోని, పల్లెవెలుగు:ప్రజలకు అందుబాటులో ఉండి… సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నా… అవకాశం ఇచ్చి గెలిపించండి అంటూ ఆదోని కూటమి అసెంబ్లీ అభ్యర్థి డా. పార్థసారధి అభ్యర్థించారు. ఆదోని పట్టణంలోని ఎమ్మిగనూరు బైపాస్​ రోడ్డు సమీపంలోని కార్తికేయ ఫంక్షన్​ హాల్​ను (బీజేపీ–జనసేన–టీడీపీ) కూటమి పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు.  దేవదేవుళ్లకు ప్రత్యేక పూజల అనంతరం డా.  పార్థసారధి మీడియాతో మాట్లాడారు. కూటమి కార్యాచరణ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని, ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఏ సమస్య ఉన్నా… తనకు నేరుగా వచ్చి చెప్పవచ్చని.. సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పట్టణ, మండల ప్రజలు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఓటు వేయాలని కోరారు.

కలిసి వస్తున్నాం….విజయం సాధిస్తాం…:

(బీజేపీ–జనసేన–టీడీపీ)కూటమి నాయకులు అందరూ కలిసి ఇంటింట ప్రచారం చేస్తామని, ఆదోని అభివృద్ధి కావాలంటే ఎమ్మెల్యే మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు కూటమి అసెంబ్లీ అభ్యర్థి డా. పార్థసారధి.  ఆదోని యువత ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. వలసలు ఆగాలంటే… ఇక్కడ ఉపాధి అవకాశాలు సృష్టిస్తామన్నారు. కార్యక్రమంలో రాయలసీమ రీజనల్​ కో ఆర్డినేటర్​, సావిత్రమ్మ,  ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, దేవేంద్రప్ప, భాస్కర్​ రెడ్డి, గుడిసె కృష్ణమ్మ, జనసేన మల్లప్ప తదితరులు పాల్గొన్నారు.

About Author