NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘నా క‌న్నీళ్లతో చంద్రబాబు భార్య కాళ్లు క‌డుగుతా ’

1 min read

పల్లెవెలుగు వెబ్​ :ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువ‌నేశ్వరి పై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యల పై క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్రసాద్ రెడ్డి స్పందించారు. నారా భువ‌నేశ్వరికి క‌న్నీళ్లతో కాళ్లు క‌డుగుతాన‌ని అన్నారు. మ‌హిళ‌ను ఎవ‌రు కించ‌ప‌రిచినా అది త‌ప్పేన‌ని శివ‌ప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ విష‌యానికి ముగింపు ప‌ల‌కాల‌ని ఎమ్మెల్యేగా విజ్ఞప్తి చేస్తున్నాన‌ని అన్నారు. చంద్రబాబు స‌తీమ‌ణి అయినా… రాజ‌శేఖ‌ర‌రెడ్డి భార్య విజ‌య‌ల‌క్ష్మి అయినా త‌న‌కు ఒకే గౌర‌వం ఉంటుంద‌ని అన్నారు. నారా భువ‌నేశ్వరి వ్యక్తిత్వాన్ని కించ‌ప‌రిచాన‌ని ఆమె భావించి ఉంటే.. ఆమె అనుమ‌తితో క‌న్నీళ్లతో కాళ్లు క‌డుగుతాన‌ని అన్నారు.

About Author