సీఎం బెయిల్ రద్దవుతుందా..?
1 min readపల్లెవెలుగు వెబ్: అక్రమాస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ .. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్ విచారణార్హత సంపాదించింది. జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరో, అరబిందో కంపెనీలకు కేటాయించిన భూముల కేసులో సీబీఐ జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘరామకృష్ణ రాజు సీబీఐ కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠ మొదలైంది. జగన్ తో పాటు అక్రమాస్తుల కేసులో సహనిందితులుగా ఉన్న పలువురికి ప్రభుత్వంలో కీలక పదవులు కట్టబెట్టారని.. వీరు సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సీబీఐ కోర్టుకు రఘురామ కృష్ణ రాజు తరపు న్యాయవాది విన్నవించారు. సాక్షులు కూడ ప్రభుత్వంలోని అధికారులే ఉన్నారని.. దీంతో విచారణ నిష్పాక్షికంగా జరిగే అవకాశంలేదని న్యాయవాది పేర్కొన్నారు. కేసు ప్రత్యేకతను దృష్టిలో ఉంచుకుని బెయిల్ రద్దు చేయాలని కోర్టుకు న్యాయవాది విన్నవించారు. అయితే… సీబీఐ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ప్రధాన ప్రశ్న. పిటిషనర్ తరపు న్యాయవాది లేవనెత్తిన ప్రశ్నలతో సీబీఐ కోర్టు ఏకీభవిస్తుందా ?.. లేక కొట్టిపారేస్తుందా అన్న విషయం త్వరలో తెలుస్తుంది. సీబీఐ కోర్టు బెయిల్ రద్దు పిటిషన్ స్వీకరించిన నేపథ్యంలో తెలుగురాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది.