జీఎస్టీ రేట్లు పెరుగుతాయా ?
1 min readపల్లెవెలుగువెబ్ : జీఎస్‌టీ రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. త్వరలో జరగనున్న జీఎఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలోనే ఈ నిర్ణయానికి ఆమోదం లభించనుంది. ప్రభుత్వం తన రెవెన్యూలను పెంచుకునేందుకు ట్యాక్స్ శ్లాబులను పెంచనుందన్నట్లు సమాచారం. ప్రస్తుతమున్న పన్ను శ్లాబును 5 శాతం నుంచి 8 శాతానికి పెంచాలని భావిస్తున్నట్లు వినవస్తోంది. అంతేకాకుండా జీఎస్‌టీ నుంచి మినహాయింపు పొందుతున్న జాబితాను కూడా కుదించనున్నట్లు తెలుస్తోంది. జీఎస్‌టీ పన్ను రేట్లు అత్యధికంగా ఉన్నాయంటూ పరిశ్రమ వర్గాలు ఇప్పటికే వాపోతున్న విషయం తెలిసిందే. వీటిని తగ్గించాలన్న డిమాండ్ తారస్థాయిలోనే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ రేట్లు పెంచితే వ్యాపార వర్గాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.