గజదొంగ అవుతాడా?
1 min read
సినిమా డెస్క్ : ‘రామారావు’, ‘ఖిలాడీ’ సినిమాలతో సెట్స్‌పై బిజీగా గడుపుతున్న రవితేజ దగ్గరకు ఓ గజదొంగ స్టోరీ వచ్చిందట. ఆయనకు కథ కూడా నచ్చి సై అంటున్నారట. స్టువర్ట్‌పురానికి చెందిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితకథను వెండితెరకు తీసుకురావాలని కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. 70వ దశకంలో వరుస దోపిడీలు, దొంగతనాలతో ప్రజలకు, పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు. అప్పట్లో ఆయన గురించి తెలుగు రాష్ట్రాల్లో కథలు కథలుగా చెప్పుకొనేవారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఈ సినిమా పట్టాలెక్కించనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, అదిసెట్ కాలేదు. ఇప్పుడీ కథ హీరో రవితేజ వద్దకు చేరిందని తెలిసింది. కథ ఆయనకి నచ్చడంతో.. సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. దీనికి వంశీ కృష్ణ నాయుడు దర్శకత్వం వహించనున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా చిత్రంలా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అభిషేక్ అగర్వాల్. ఈ సినిమాని వచ్చే ఏడాదిలో సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.