‘నివేదా థామస్’ మనసు మారేనా..?
1 min readసినీరంగంలో రాణించాలంటే.. సమయ స్పూర్తి..కథలను ఎంచుకునే నైపుణ్యం.. పాత్రలో పరకాయ ప్రవేశం చేసే సత్తా..అన్నిటికీ మించి ఎలాంటి పాత్ర చేసినా ప్రేక్షకులను మెప్పించడం చాలా ముఖ్యం. ప్రేక్షకుల హృదయాలలో శాశ్వితంగా నిలిచిపోవాలంటే.. అందం, అభినయం, సహజంగా పాత్రలో పరకాయ ప్రవేశం చేసే సత్తాతోపాటు ప్రేక్షకుల అంచనాకు తగ్గట్టుగా కనిపించి… వారి దృష్టిని ఆకర్షించాల్సి ఉంటుంది. అలాంటి వారి జాబితాలో యంగ్ హీరోయిన్ నివేదా థామస్ లేదని వినిపిస్తోంది. మలయాళంలో మంచి నటిగా గుర్తింపు పొందిన నివేదా థామస్ టాలెంటెడ్ డైరెక్టర్ ఇంద్రగంటి మొహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘జెంటిల్ మాన్ ’ నిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయింది. ఈసినిమా సూపర్ హిట్ అవడంతో టాలీవుడ్ మేకర్స్ దృష్ఠి నివేదా థామస్ మీద పడింది. ఆతర్వాత నిన్ను కోరి, జై లవ కుశ, 118, బ్రోచేవారెవరురా, సినిమాలలో హీరోయిన్‌గా నటించింది. నివేదా థామస్‌కి ఉన్న టాలెంట్‌తో ఈపాటికి కనీసం ఓ 20 సినిమాలైనా చేసి ఉండాల్సింది. తన సహజమైన నటన అంత బావుంటుందని ప్రేక్షకుల అభిప్రాయం. అయితే చాలా సెలెక్టెడ్‌గా సినిమాలు ఎంచుకోవడంతో నివేదా థామస్ గ్లామర్ హీరోయిన్స్‌తో పోటీ పడలేకపోయింది. ప్రేక్షకులకు కావాల్సింది హీరోయిన్ అన్నాక అన్నీ విధాలుగా మెప్పించడం. కానీ నివేదా గ్లామర్ పాత్రల్లో నటించడానికి ఆసక్తి చూపించకపోవడంతో కెరీర్ నత్త నడకన సాగుతోంది. హీరోయిన్ అంటే ఒక వర్గానికి చెందిన ప్రేక్షకులు ‘గ్లామరసాన్ని’ కోరుకుంటారు. ఈ విషయంలో అభిమానులను నివేదా థామస్ నిరాశపరుస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈకారణంగానే నివేదా థామస్ నుంచి ఆశించినన్ని సినిమాలు రావడం లేదన్న మాట కూడా వినిపిస్తోంది. నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలతో పాటు కాస్త గ్లామరస్‌గా కనిపిస్తే ఖచ్చితంగా నివేదా థామస్ స్టార్ స్టేటస్‌ని అందుకుంటుందనడంలో సందేహం లేదు. మరి ఇకనుంచైనా ఈ లాజిక్ మిస్సవకుండా మనసు మార్చుకొని అభిమానులను అలరించడానికి, వారిని సంతృపి పరిచే పాత్రల్లో కనిపిస్తుందేమో చూడాలి. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో నివేదా థామస్ కనిపించబోతుండగా ఏప్రిల్ 9న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.