పాకిస్థాన్ జల సమాధి కానుందా ?
1 min readపల్లెవెలుగువెబ్ : దాయాది దేశం పాక్‌కు మరో ఉపద్రవం వచ్చి పడనుంది. ఇది ఊహ కాదు.. తీవ్ర హెచ్చరికలు. ఇప్పటికే తీవ్ర వర్షాలు, భారీ వరదలతో మూడింట వంతు పాక్ నీటిలోనే ముగినిపోయి ఉంది. వెయ్యి మందికి పైగా ప్రాణాలు.. మూడు కోట్ల మంది నిరాశ్రయలు అయ్యారు. అయితే.. రాబోయే రోజుల్లో మరో భారీ ముప్పు పాక్‌కు పొంచి ఉందని భారత సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఇది భారత్‌కు సైతం పరోక్ష హెచ్చరికగా పేర్కొంటున్నారు. సాధారణంగా వర్షాకాలపు సీజన్ కంటే.. ఈసారి పదిరెట్లు అధికంగా అక్కడ వర్షాలు కురిశాయి. దీంతో పాక్ సగానికి కంటే ఎక్కువ భాగం నీటమునిగింది. సహాయక చర్యల్లో భాగంగా.. హెలికాఫ్టర్లు ల్యాండ్ అయ్యేందుకు భూభాగం కూడా దొరకట్లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు అంటువ్యాధులు ప్రబలడం.. ఇతర సమస్యలతో పాక్ ప్రజలు అరిగోస పడుతున్నారు. ఇప్పట్లో కోలుకోలేనంతగా నష్టం వాటిల్లింది.