NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అప్పుల‌న్నీ తీర్చేస్తా : క‌మ‌ల్ హాస‌న్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌మ‌ల్ హ‌స‌న్ హీరోగా న‌టించిన విక్ర‌మ్ బాక్సాఫీస్ ఊచ‌కోత కోసింది. దాదాపు రూ. 300 కోట్ల వ‌సూళ్లు సాధించింది. ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు క‌మ‌ల్ హ‌స‌న్. ‘ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలంటే డబ్బు గురించి చింతించని నాయకుడు మనకు కావాలి. గతంలో ఒకసారి నేను రూ. 300 కోట్లు సంపాదించగలను అని చెబితే ఎవరూ నా మాట నమ్మలేదు. అసలు వాళ్లు అర్థం చేసుకోలేదు కూడా. ఇప్పుడు విక్రమ్‌ బాక్సాఫీస్‌ వసూళ్లతో నా మాట నిజమైంది. ఇక ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా. నాకిష్టమైన ఆహారాన్ని తింటాను. నా కుటుంబం, సన్నిహితులకు చేతనైన సాయం చేస్తాను. ఒకవేళ నా దగ్గర డబ్బు అయిపోతే ఇవ్వడానికి ఏం లేదని చెప్పేస్తా. వేరే వాళ్ల దగ్గర డబ్బు తీసుకుని పక్కన వాళ్ల సాయం చేయాలని నాకు ఉండదు. నాకు గొప్ప పేరు వద్దు. ఒక మంచి మనిషిగా ఉండాలనుకుంటున్నాను.’ అని కమల్‌ హాసన్‌ పేర్కొన్నాడు.

Facebook(Opens in a new browser tab)

                                           

About Author