PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏలూరులో స్వర్ణకారులకు అండగా ఉంటా..

1 min read

– మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని
పల్లెవెలుగు , వెబ్ ఏలూరు : రాష్ట్రంలోని బిసిల సంక్షేమ కోసం ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు శాసన సభ్యులు ఆళ్ల నాని తెలిపారు.రాష్ట్ర స్వర్ణకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఏలూరు గడియార స్థంభం వద్ద జరిగిన స్వర్ణకారులకు ముద్ర రుణాల పంపిణీ కార్యక్రమంలోఆజీ ఉపముఖ్యమంత్రి,ఏలూరు శాసన సభ్యులు ఆళ్ల నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఏలూరులోని 117మంది స్వర్ణకారులకు ఒక్కొక్కరికి రూ.4,68,000/- చొప్పున కేటాయించబడిన రూ.5కోట్ల 47లక్షల 56వేల రూపాయల ముద్ర రుణాల చెక్కును మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆళ్ల నాని చేతుల మీదుగా స్వర్ణకారులకు అందచేశారు.ఏలూరులోని స్వర్ణకారుల సంక్షేమ కోసం ఎమ్మెల్యే ఆళ్ల నాని అందించిన సేవలను ఈ సందర్భంగా స్వర్ణకారుల సంఘం నాయకులు కాశీ.వేణు మాధవ్,కాదలూరి తిలక్ కొనియాడారు.స్వర్ణ కారుల సంక్షేమ భవన నిర్మాణం కోసం ఎమ్మెల్యే ఆళ్ల నాని గారిని కోరగా 600 గజాల స్థలాన్ని కేటాయించటమ్ ఎన్నటికీ మరువలేమని అన్నారు.అంతే కాకుండా భవన నిర్మాణానికి కూడా తనవంతుగా రూ.10లక్షల రూపాయలు నిధులు అందించటం తో పాటు ఎంపీ నిధులు నుంచి కూడా మరో రూ.15లక్షల రూపాయలు అందించేలా సహకరించారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆళ్ళనానిని స్వర్ణకారులు సత్కరించారు.ఈసందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీ వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి గారు కొండంత అండగా నిలిస్తున్నారని అన్నారు. బీసీల సంక్షేమానికి సహకరీంచేలా అనేక సంక్షేమ పధకాలను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నారని ఆళ్ల నాని తెలిపారు.బిసిల సంక్షేమం తో పాటు రాజ్యాధికారంలో కూడా బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పించేలా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారని,ప్రభుత్వ నామినేటెడ్ పదవుల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ కమిటీల వరకు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత నిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో ప్రభుత్వం బీసీలకు అండగా నిలుస్తుందని ఆళ్ల నాని తెలిపారు.స్వర్ణకారులకు అందిన ఈ రుణాలను సద్వినియోగం చేసుకుని వారు మరింత అభివృద్ధి చెందాలని, త్వరలోనే మిగతా స్వర్ణకారులకు కూడా రుణాలు అందేలా సహకరిస్తామని తెలిపారు.ఏలూరులోని స్వర్ణకార కుటుంబాలకు ఎల్లప్పుడూ అన్ని విధాలా తాను అండగా ఉంటాను అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు,డిప్యూటీ మేయర్లు శ్రీనివాస్,నూకపెయ్యి సుధీర్ బాబు,మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరుసు.చిరంజీవులు, వైఎస్సార్ సిపి నాయకులు MRD బలరాం, SMR పెదబాబు, కార్పొరేటర్లు పైడి.భీమేస్వర రావు, సుంకర చంద్రశేఖర్, వంకదారు ప్రవీణ్, రాష్ట్ర స్వర్ణకారులు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్రి.వేణు మాధవ్, స్వర్ణకారుల సంఘం నాయకులు కాదలూరి తిలక్, బొద్దురి నాగభూషణం,రేపాక దుర్గా ప్రసాద్,తుంపాల సాయికృష్ణ,చోటే,లంకలపల్లి వర ప్రసాద్,ఏలూరు బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ పొట్నూరి ప్రవీణ్ కుమార్, వైఎస్సార్ సిపి నాయకులు గూడూరి హేమ దుర్గా ప్రసాద్, విజయ్ కుమార్ జైన్, ఏలూరులోని స్వర్ణకారులు తదితరులు పాల్గొన్నారు.

About Author