PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కార్మికుల‌కు అండ‌గా ఉండి ఉపాధి క‌ల్పిస్తా.. టి.జి భ‌ర‌త్‌

1 min read

వైసీపీని వీడి టిడిపిలో చేరిన సెంట్రింగ్ వ‌ర్క‌ర్లు, యాక్టింగ్ డ్రైవ‌ర్లు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: క‌ర్నూల్లో ఉన్న‌ కార్మికుల‌కు అండ‌గా ఉండి ఉపాధి క‌ల్పిస్తాన‌ని క‌ర్నూలు నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భ‌రత్ అన్నారు. 3వ వార్డులోని బండిమెట్ట‌లో సెంట్రింగ్ వ‌ర్క‌ర్లు, యాక్టింగ్ డ్రైవ‌ర్లు లాల్ చాచా, అన్వ‌ర్‌, అక్బ‌ర్ భాయ్ బృందం స‌భ్యులు వైసీపీని వీడి టి.జి భ‌ర‌త్ స‌మ‌క్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టి.జి భ‌ర‌త్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంత‌రం టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ క‌ర్నూల్లో గ‌త 9 ఏళ్ల 9 నెల‌లుగా పాల‌న ఎలా ఉందో అంద‌రూ చూశారన్నారు. స‌రైన నాయ‌కుల‌ చేతిలో పాల‌న లేక ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతూనే ఉన్నారన్నారు. మంచి నాయ‌కుడు, మంచి ప్ర‌భుత్వం ఉంటేనే ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుందన్నారు. ఎన్నిక‌లు వ‌చ్చిన‌పుడు కులం, మతం పేరు చెప్పి ఓట్లు అడుగుతార‌ని.. కానీ తాను మాత్రం తండ్రి చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరుతున్న‌ట్లు భ‌ర‌త్ తెలిపారు. త‌మ‌కు, ఇత‌రుల‌కు ఉన్న తేడాను ప్ర‌జ‌లు గుర్తించాలని కోరారు. త్వ‌ర‌లో మ‌రో పార్టీ నాయ‌కులు వ‌చ్చి ఇక్క‌డే మీటింగ్ పెట్టి మాయ‌మాట‌లు చెప్పి ఓట్లు అడుగుతారన్నారు. అయితే మంచి ప‌నులు చేసేందుకు రాజ‌కీయాల్లో ఉంటున్న త‌మ‌కు ప్ర‌జ‌లు మ‌ద్ద‌తివ్వాలన్నారు. టి.జి వెంక‌టేష్ అధికారంలో ఉన్న‌ప్పుడు స‌మ్మ‌ర్ స్టోరేజీ ట్యాంకు క‌ట్టించ‌డంతో పాటు న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల్లో ఓవ‌ర్ హెడ్ ట్యాంకులు నిర్మించి ప్ర‌జ‌ల‌కు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా చేశారన్నారు. ఆయ‌న చేసిన ఈ మంచి ప‌నుల వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఇప్పుడు త్రాగునీరు అందుతోంద‌న్నారు. 2014లో టి.జి వెంక‌టేష్‌ని గెలిపించి ఉంటే చెక్ డ్యాం కూడా నిర్మించి క‌ర్నూలుకు త్రాగునీటి ఇబ్బందులు శాశ్వ‌తంగా లేకుండా చేసేవారన్నారు. త‌ర్వాత వ‌చ్చిన నాయ‌కులు చెక్ డ్యాం నిర్మించాల‌న్న ఆలోచ‌న కూడా చేయ‌లేదన్నారు. అందుకే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు ఓటు వేసి గెలిపించి ఎమ్మెల్యేగా అవ‌కాశం ఇవ్వాల‌ని.. ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండి స‌మ‌స్య‌లు లేకుండా చూసుకుంటాన‌న్నారు. యువ‌త‌కు ఉద్యోగాలు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారికి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించేందుకు తాను కృషి చేస్తాన‌ని తెలిపారు. ఈ ప్ర‌భుత్వంలో ఒక్క రూపాయి ఇచ్చి.. మీ నుండే మ‌ళ్లీ ప‌ది రూపాయ‌లు తీసుకుంటున్నారన్నారు. వీట‌న్నింటిని ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌న్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వ‌స్తే ధ‌ర‌లు నియంత్ర‌ణ‌లో ఉంచుతామ‌న్నారు. పార్టీలో చేరిన వారిలో అబ్దుల్లా, జావీద్, మౌలాలి, షాహీద్‌, మాద‌షా, ఖాజా ఉన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వార్డు నాయ‌కులు నాగ వీరాంజ‌నేయులు, ఉమామ‌హేశ్వ‌రి, రాజేశ్వ‌రి, హ‌రి క్రిష్ణా రావు, మాబాషా, ఊట్ల రమేష్, టిడిపి సీనియ‌ర్ నేత‌లు మ‌న్సూర్ ఆలీఖాన్‌, మెహ‌బూబ్ ఖాన్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

About Author