ఆంధ్ర ప్రభుత్వం కూలనుందా ?
1 min readపల్లెవెలుగువెబ్ : తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారాని కి సంబంధించి పలు వీడియోలను ఆయన మీడియా ముందు ప్రదర్శించారు. ” ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి చేసిన కుట్ర వీడియోలో రికార్డయింది.ఈ కాపీలను దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సుప్రీంకోర్టుతో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు, హైకోర్టులు, పార్టీల అధ్యక్షులు, మీడియా సంస్థలకు పంపించాం. చేతులు జోడించి వేడుకుంటున్నా. ఎప్పుడు ప్రమాదంలో పడినా న్యాయవ్యవస్థ మాత్రమే ఈ దేశాన్ని కాపాడింది. దేశంలో ఇప్పటి వరకు 8 రాష్ట్రాల ప్రభుత్వాలను కూలగొట్టామని చెబుతున్నారు. కర్నాటక, మహారాష్ట్రలో ప్రభుత్వాలను కూలగొట్టింది తామేనని ఎలాంటి భయం లేకుండా వారు చెబుతున్నారు. ఆ తరువాత తెలంగాణ , ఆంధ్ర, దిల్లీ, రాజస్థాన్ ప్రభుత్వాలను కూలగొడతామని అంటున్నారు. ఈడీని చూపించి బెదిరిస్తున్నారు.” అని కేసీఆర్ పేర్కొన్నారు.