రైతుల గోనె సంచుల వ్యవహారం కొలిక్కి వచ్చేనా
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండలంలోని 9 గ్రామాలలో 2020-2021లో మార్క్ ఫెడ్ వారు మహిళా మండలి సమాఖ్య ద్వారా గ్రామాల్లో ఉన్న బుక్ కీపర్లు మరియు గ్రామైఖ్య సంఘం వారు మొక్కజొన్నలను కొనుగోలు చేశారు.కానీ రైతుల గోనే సంచులను రైతులకు ఇవ్వకుండా గోల్మాల్ చేసిన సంగతి తెలిసిందే.మండల పరిధిలోని తలముడిపి గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్లు గ్రామంలో ఉన్న రైతులకు 16,642 గోనె సంచులను తిరిగి ఇవ్వాలని ఆయన జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు.జిల్లా అధికారుల స్పందించి వెంటనే రైతులకు ఈసంచులను ఇవ్వాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం అనంతరం మధ్యాహ్నం ఎంపీపీ కార్యాలయంలో సంచుల వ్యవహారంపై ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మకు తలముడిపి సర్పంచ్ వెంకటేశ్వర్లు వివరంగా తెలియజేశారు.గతంలో మండలంలో పనిచేసిన ఏపిఎం కల్పలత ఎంపీపీతో మాట్లాడారు. వీటిలో నాప్రమేయం లేదని కల్పలత అన్నారు. మండలంలోని 9 గ్రామాలలో రైతులకు అందాల్సిన సంచులు వివరాలు తలముడిపి-16,642, అలగనూరు- 12,399,జలకనూరు-12,235,నాగలూటి-5935,మాస పేట-3265,కడుమూరు-5667,వీపనగండ్ల-7752, తిమ్మాపురం-574, చెరుకుచెర్ల-4202 ఈగ్రామాలలో దండోరా వేయించి రైతులకు సంచులు అందని వారందరికీ సంచులను పంపిణీ చేయించాలని కల్పలతకు మల్లు వెంకటేశ్వరమ్మ సూచించారు.ఈకార్యక్రమంలో ఏఓ పీరు నాయక్, సహకార సొసైటీ చైర్మన్ నాగర్ తులసి రెడ్డి,సర్పంచులు నాగ స్వామి రెడ్డి,ఫణిభూషణ్ రెడ్డి,సిసి కృష్ణారెడ్డి,బుక్ కీపర్లు తదితరులు పాల్గొన్నారు.