NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆస్కార్‌‌ వరిస్తుందా..!

1 min read

పల్లెవెలుగు వెబ్​ : బాలీవుడ్ స్టార్‌‌ హీరోయిన్‌ విద్యాబాలన్‌ టాలీవుడ్‌లో తెలియని వారు ఉండరు. ‘డర్టీ పిక్చర్‌‌’ మూవీతో లక్షల మంది అభిమానులను పోగేసుకుంది విద్య. రీసెంట్‌గా ఎన్టీఆర్‌‌ ‘మహానాయకుడు’ లో బసవ తారకం పాత్రతో తెలుగు అభిమానులకు మరింత దగ్గరయ్యింది. ఇప్పుడామెకి ఆస్కార్‌‌ అకాడమీ నుంచి అరుదైన గౌరవం లభించింది. ఆస్కార్ అవార్డ్ అంటేనే ప్రత్యేకం. జీవితంలో ఒక్కసారైనా దాన్ని అందుకోవాలని ప్రతి యాక్టర్ ఆశపడతాడు. అలాంటి ఆస్కార్ అకాడెమీ రీసెంట్‌గా రిలీజ్ చేసిన సభ్యుల జాబితాలో విద్యకు చోటు దక్కింది. మొత్తం యాభై దేశాలకు చెందిన 395 మంది సభ్యులతో ‘ద క్లాస్ ఆఫ్ 2021’ పేరుతో రిలీజ్ చేసిన ఈ లిస్టులో నలభయ్యారు శాతం మంది మహిళలు ఉండటం విశేషం. అలాగే మొత్తం సభ్యుల్లో ఎనభై తొమ్మిది మంది మాజీ ఆస్కార్ నామినీలు, పాతిక మంది ఆస్కార్ విన్నర్స్ ఉన్నారు. మన దేశం నుంచి ఈ లిస్టులో చోటు సంపాదించిన ఏకైక యాక్టర్ విద్య. తుమ్హారీ సులు, కహానీ చిత్రాల్లో అద్భుతంగా నటించిన విద్యా బాలన్ అంటూ ఆమె గురించి రాసింది అకాడెమీ. ఆమెతో పాటు ప్రొడ్యూసర్స్‌ ఏక్తా కపూర్, శోభా కపూర్‌‌ కూడా సెలెక్ట్ అయ్యారు. ఇంతవరకు ఆమె నటన చూసి అందరూ అబ్బురపడ్డారు. ఇప్పుడీ ఘనత సాధించిన విద్యను చూసి గర్వపడుతున్నారు.

About Author