నిర్లక్ష్యం నీడ వీడేనా.. కంపు కొడుతున్న గ్రామాలు
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: పచ్చదనం పారిశుద్ధ్యం తో గ్రామాలను కళకళలాడిస్తామని తడి చెత్త పొడి చెత్త అంటూ ఊకదంప్పుడు ఉపన్యాసాలతో అధికారులు ఒకచోటకు చేరి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు అప్పుడప్పుడు చెత్త సంపద కేంద్రాలను సందర్శించి గ్రామంలో సేకరించిన చెత్తతో సేంద్రియ ఏరువు తయారుచేసి రసాయన ఎరువు ఉపయోగం లేకుండా చేస్తామని ప్రతిజ్ఞలు చేస్తుంటారు. కానీ నాణానికి బొమ్మ బొరుసు ఎలాగో గ్రామాలలో పరిస్థితి విరుద్ధంగా ఉంటుంది సేకరించిన చెత్తను ప్లాస్టిక్ వ్యర్ధాలను రోడ్డు పైనే పారవేస్తూ వాటిని కాల్చి పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారు ఇంత జరుగుతున్న అధికారులు తమకేమీ పట్టనట్టు అదే రహదారిపై ప్రయాణిస్తున్న కనపడనట్టు నటించడం షరా మామూలు అయింది మండలంలోని అన్ని గ్రామాల్లో చెత్త సంపద కేంద్రాలు ఉన్న వాటిలో ఎటువంటి సేంద్రియ ఎరువు ఉత్పత్తి కానీ చెత్త సంపద కేంద్రాలకు పూర్తిస్థాయిలో చెత్త తరలిన దాఖలను కనిపించడం లేదు ఆరు బయటనే ఊరికి దగ్గరలో చెత్తను పారవేస్తున్నారు సాక్షాత్తు మండల కేంద్రమైన గడివేముల గ్రామంలో పారిశుద్ధ్యం చెత్త సేకరణ పై ఎంపీడీవో ఈఓఆర్డి పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణ లేదన్నది బహిరంగ నిజం.. ప్రతి గ్రామంలో గ్రామానికి దగ్గరలో చెత్త కుప్పలు దర్శనం ఇవ్వడం సర్వసాధారణమైపోయింది కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపంలా తయారైంది మండలంలోని గ్రామాల పరిస్థితి ఇదేనా పచ్చదనం పరిశుభ్రత అంటూ గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.