తల్లిదండ్రులు ఉండగా.. కుమారుడికి ఆస్తిపై హక్కు ఉంటుందా ?
1 min readపల్లెవెలుగువెబ్ : తల్లిదండ్రులు జీవించి ఉండగా ఆస్తిపై కుమారునికి ఎలాంటి హక్కు ఉండదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. సోనియా ఖాన్ అనే మహిళ భర్త ప్రస్తుతం దాదాపుగా కోమా పరిస్థితుల్లో ఉన్నారు. ఈ కారణంగా ఆయన ఆస్తుల విషయంలో తనను చట్టపర సంరక్షకురాలిగా గుర్తించాలని కోరుతూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో వారి కుమారుడు ఆసిఫ్ ఖాన్ జోక్యం చేసుకుంటూ తండ్రిని చాలా ఏళ్లుగా తానే చూసుకుంటున్నానని, అందువల్ల తననే ఆస్తులకు గార్డియన్‌గా గుర్తించాలని కోరారు. దీన్ని విచారించిన జస్టిస్ గౌతం పటేల్, జస్టిస్ మాధవ్ జమ్‌దార్‌ల ధర్మాసనం ఆసిఫ్ చేసిన వినతిని తిరస్కరించింది. ఎక్కడో నివసిస్తూ తండ్రిని అసలు పట్టించుకోవడంలేదని తెలిపింది. ఏ మతానికి చెందిన వారసత్వ చట్టాల్లోనూ తల్లిదండ్రులు జీవించి ఉండగా, కుమారునికి ఆస్తిపై హక్కు కలిగించలేదని పేర్కొంది. దీన్ని ప్రత్యేకమైన కేసుగా పరిగణించి తగిన నిర్ణయం వెలువరిస్తామని తెలిపింది.