హిందూ దేవతలను తిడితే చర్యలు ఉండవా ?
1 min readపల్లెవెలుగువెబ్ : హిందూ దేవతలపై పదే పదే దూషణలు చేస్తున్న ఖాతాలను ఎందుకు తొలగించడం లేదని ప్రముఖ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్‌ను ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతా తొలగించినప్పుడు ఇండియాలో ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని అడిగింది. ఇతర మతాల, ఇతర ప్రాంతాల ప్రజల సున్నిత మనస్తత్వాల గురించి ట్విట్టర్ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్విట్టర్‌లో ‘ఏతీష్ట్ రిపబ్లిక్, మా కాళి’ అనే ఖాతాలు సహా అనేక ఖాతాల నుంచి హిందూ దేవతలపై అభ్యంతరకర విమర్శలు వస్తున్నాయని ఒక వ్యక్తి వేసిన పిటిషన్‌ను హైకోర్టు చీఫ్ జస్టిస్ విపిన్ సంఘి, జస్టిన్ నవీన్ చల్వీ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ హిందూ దేవతలపై విమర్శలు చేస్తున్న వారి ఖాతాల తొలగింపుపై ట్విట్టర్‌ను నిలదీసింది.