ఆ తెగల వారికి కరోన సోకితే అంతరించిపోతారు ?
1 min readపల్లెవెలుగు వెబ్: దేశంలో ఉన్న వివిధ గిరిజన జాతులకు వెంటనే వ్యాక్సిన్ వేయాలని, లేదంటే ఆ తెగలు అంతరించే ప్రమాదం ఉందని జాతీయ మానవ హక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రమాదం ముంగిట ఉన్న తెగలకు 60 రోజుల్లో వ్యాక్సిన్ వేయాలని రాష్ట్రాలకు ఎన్ హెచ్ఆర్సీ సూచించింది. దేశంలో 175 గిరిజన జిల్లాలు ఉండగా.. వాటిలో 705 తెగులు ఉన్నాయని తెలిపింది. వాటిలో లక్షలోపు జనాభాతో 75 తెగలు అంతరించే ముప్పును ఎదుర్కొంటున్నాయని ఎన్ హెచ్ఆర్సీ పేర్కొంది. ఈ తెగల్లో కరోన వ్యాప్తి చెందితే అంతరించే ప్రమాదం మరింత పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆ తెగల వారికి అవసరమైన అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించాలని రాష్ట్రాలకు సూచించింది. ఆ ప్రాంతాల్లోకి ఇతరులను ప్రవేశించనివ్వకుండా డ్రోన్ల ద్వార మందులు సరఫరా చేయాలని తెలిపింది. వారికి అందించే సంక్షేమ పథకాలు, రేషన్ సరఫరాను ఇంటి వద్దకే అందించాలని తెలిపింది.