ప్రధాని కోసం పనిచేయను : కునాల్
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రధాన మంత్రి ఆఫీసు నుంచి ఓ ప్రత్యేక బల్ల తయారు చేయమని ప్రముఖ డిజైనర్ కునాల్ కు ఆఫర్ వచ్చింది. వేరేవారు ఎవరైనా ఈ అవకాశం వస్తే ఎగిరి గంతేస్తారు. కానీ కునాల్ మాత్రం తయారు చేయనని చెప్పాడు. పీఎంవోలో శాశ్వత ప్రాతిపదికన ప్రత్యేక బల్ల (టేబుల్) తయారీ కోరుతూ ప్రధానమంత్రి వ్యక్తిగత కార్యదర్శి వివేక్ కుమార్ ఇటీవల కునాల్‌కు లేఖ రాశారు. డిజైనింగ్ రంగంలో ఆయన ప్రతిభను గుర్తించిన ప్రధాని మోదీ ఈ అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీనిని తిరస్కరిస్తూ కునాల్ తీవ్రమైన అభ్యంతరాలతో లేఖ రాశారు. దేశంలో 20 శాతం ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారని ప్రస్తావించారు. పీఎంవో ప్రతిపాదనను ఒప్పుకొంటే.. దళితులు, కుటుంబం, మైనార్టీలు, ఎల్జీబీటీక్యూ సమూహానికి ద్రోహం చేసినవాడిని అవుతానని పేర్కొన్నారు. 22 శాతం జనాభా ఉన్న ముస్లింలను సమాజం నుంచి మరింత వేరు చేసేలా మోదీ సర్కారు తీసుకునే నిర్ణయాలకు వేదికగా నిలిచే టేబుల్‌ను తయారు చేయబోనని స్పష్టం చేశారు. తనకుతాను గాంధేయ వాదినని చెప్పుకొంటూ.. అహింసా విధానం, సత్యాగ్రహం పట్ల విధేయతను ప్రకటించారు.