PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విశ్వబ్రాహ్మణుల అపరకర్మల భవనానికి, సంఘ స్థలానికి కృషి చేస్తా..

1 min read

ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళనాని హామి..

వైసీపీ పార్టీకి సంఘ సభ్యుల సహకారం  మరువలేనిది

విశ్వబ్రాహ్మణ సాంప్రదాయ వృత్తులు కనుమరుతున్నాయి..

ఉద్యోగ, వ్యాపారస్తుల సంక్షేమ సంఘం అధ్యక్షులు శివశ్రీ

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  ఆదివారం విశ్వబ్రాహ్మణ అనుబంధవృత్తిసంఘాలు ఆళ్ళనాని క్యాంపుకార్యాలయంలో కలిశారు విశ్వబ్రాహ్మణసంస్కృతిలో అపరఖర్మలకు అత్యంతప్రాధాన్యతఉందని ఇందుకు సరైన భవనంలేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని విశ్వబ్రాహ్మణకార్పొరేషన్ డైరెక్టర్ లక్కోజుగోపి ఆధ్వర్యంలో సంఘప్రతినిధులు నాని దృష్టికి తీసుకువెళ్ళరు ఈసందర్భంగా ఆయనస్పందిస్తూ వివిధసందర్భాలలో ఈవిషయాన్ని సంఘీయులు తమదృష్టికితెచ్చారని అతిత్వరలోనే నగరంలో అపరకర్మలకువీలుగా స్థలసేకరణచేసి సంఘానికి ఇస్తామన్నారు అలాగే కార్పెంటర్లు వృత్తికి అనువుగా క్లస్టర్ ఏర్పాటుగురించి సంబంధిత అధికారులతో చర్చించి ప్రభుత్వపరంగా తనపరంగా అవసరమయిన మేరకుతనవంతుపూర్తిసహాయసహకారాన్ని అందిస్తానన్నారు విశ్వబ్రాహ్మణులకు అవసరమయిన ఏవిషయంలోనైనా తనపూర్తిసహాయసహకారాలను అందిస్తానని ఆయనప్రకటించారు. ఈసందర్భంగాలక్కోజుగోపి మాట్లాడుతూ నగరంలో బిసిసామాజికవర్గాలపక్షపాతి గావివిధబిసిసా మాజికవర్గాలకు కమ్యూనిటిహాల్స్ నిర్మాణానికి స్థలాలుకేటాయించడంలోను భవననిర్మాణంలోను అడిగినవారందరికి సహకరించారని అలాగే అనేకమందిపేదకుటుంబాలకు ఇళ్ళనిర్మాణంలోను అడిగినవారికి అర్హతగలవారందరికి న్యాయంజరిగిందన్నారు అదేవిధంగా విశ్వబ్రాహ్మణసామాజికవర్గానికి సహకరించాలనికోరారు . వడ్రంపనివారలసంఘం అధ్యక్షులు పొట్నూరిశివరావుమాట్లాడుతూ వడ్రంపనివారలు వర్క్ షెడ్లులేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని షెడ్లునిర్మాణానికి చర్యలుతీసుకోవాలనికోరారు నానినికలిశినవారిలో ఈరోజు శనివారి పేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ లకోజు రాజగోపాలాచారి నేతృత్వంలో  విశ్వబ్రాహ్మణుల కులంలో ఉన్న అన్ని కుల వృత్తుదారులు,వ్యాపారస్తులు హేలాపూరి విశ్వబ్రాహ్మణ సంఘంఅధ్యక్షులు గూడూరిహేమదుర్గాప్రసాద్  బులియన్ మర్చంట్స్ జోనల్ చైర్మన్ కాదరాంబాబు, వడ్రంగి సంక్షేమ సంఘం,శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం శనివార్ పేట రుద్రభూమి సంఘం స్వర్ణకారులు అందరూ ఈరోజు విశ్వబ్రాహ్మణ ఐక్యవేదికగా ఏర్పడి గౌరవ ఆళ్లనాని గారిని కలవడం జరిగింది ఎంఎల్ఏనాని హామిఇచ్చిననేపధ్యంలో విశ్వబ్రాహ్మణవృత్తిసంఘాలనాయకు నానినిఘనంగాసన్మానించి అభినందనలుతెలిపారు ఈసందర్భంగా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణడవలప్ మెంట్కార్పొరేషన్ డైరెక్టర్ లక్కోజురాజగోపాలాచారి మాట్లాడుతూబీసీ కుటుంబాలకి ఒక అన్నగా ఒక కొడుకుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ  2004,2009,2019 మూడుసార్లు ఎమ్మెల్యేగా అయిన దగ్గర నుండి  దాదాపుగా 54 వేల ఇల్లు ఇచ్చిన ఘన చరిత్ర మీదని అంతే కాకుండా 15,16 కులాలకి కమిటీ హాల్స్ తో పాటు నిధులు ఇచ్చిన ఏకైక నాయకులుగా బీసీలపట్ల ఎంతో ప్రేమతో మా కుటుంబాలకు చేస్తున్న సేవలనుమరువమని అన్నారు  రాబోయే రోజుల్లో బీసీలంతా మీ వెంటే ఉంటామని తెలిపారు.   మా సామాజికవర్గానికి కూడా రాజకీయ అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హేలాపురి విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు జిహెచ్డి ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో విశ్వబ్రాహ్మణులకు ఏం న్యాయం జరగలేదు మోసపూరితమైన వాగ్దానాలు మాటలతో కాలం వెళ్ళబుచ్చారు.  మీరు వచ్చిన తర్వాత మాకు ఒక కార్పొరేటర్ ఒక స్టేట్ డైరెక్టర్ ఇచ్చిన ఘనత మీదే అన్నారు.  విశ్వబ్రాహ్మణ ఉద్యోగవ్యాపారస్థుల సంక్షేమసంఘం అధ్యక్షులు ఎ.శివకేశవరావు (శివ శ్రీ) మాట్లాడుతూ విశ్వబ్రాహమణ సాంప్రదాయ వృత్తులు కనుమరుగవుతున్నాయని క్లస్టర్ స్కీమ్ ద్వారాకార్పెంటర్లకు కామన్ మెషినరి సెంటర్ వర్క్ షెడ్లనిర్మాణం ప్రభుత్వపరంగా చేపట్టాలనికోరారు. విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ముదురు సత్యనారాయణ మాట్లాడుతూ  మాకు ఇళ్ల స్థలాలు ఆసరా వంటి పథకాలు పూర్తిస్థాయిగా అందిస్తున్న మీకు మా మద్దతు ఉంటుందని తెలియజేసారు. కె.కె. ఎస్ సంస్థల అధినేత కాద రాంబాబు మాట్లాడుతూ  వ్యాపారస్తులకు అండగా ఉంటామని వ్యాపారస్తులంతా నానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి కేళ్ల దుర్గాప్రసాద్, లంకలపల్లిజగదీష్ అద్దంకి సత్యనారాయణ కొక్కొండ వీరబ్రహ్మం, కొత్తల శివ, కే సూర్య ప్రకాష్ ,సింహాద్రి బృంగాచారి , బుద్ధురి సత్యనారాయణ వీర్ని వైనేశ్వరరావు, మానేపల్లి నాగేశ్వరరావు, ఎలబాక కృష్ణ, బొద్దూరి ప్రసాద్, నల్లబాటి కామేశ్వరరావు, పాలచర్ల సురేష్  పెద్ద సంఖ్యలో వివిధ వృత్తుల్లో ఉన్న విశ్వబ్రాహ్మణ సోదరులు హాజరయ్యారు.

About Author