మండల విద్యాభివృద్ధికి కృషి చేస్తా… విద్యాశాఖ అధికారి
1 min read– మండలంలో పాఠశాలల అభివృద్ధి ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రత్యేక ప్రణాళికలు..
– ఎంఈఓ విమల వసుంధర దేవి.
పల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండల విద్యాభివృద్ధికి కృషి చేస్తానని మండల విద్యాశాఖ అధికారి 2 శ్రీమతి ఎం. విమల వసుంధర దేవి పేర్కొన్నారు. సోమవారం గడిగరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి గడివేముల ఎంఈఓ 2 గా బదిలీపై వెళ్లిన శ్రీమతి ఎన్. విమల వసుంధర దేవి ని గడిగరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల సిబ్బంది మరియు గ్రామ సర్పంచ్ తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మండలంలో నాడు – నేడు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, జె వీ కే కిట్లు, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జి ఈ ఆర్ ) నమోదు కార్యక్రమాలను వంద శాతం పూర్తి చేయాలని ఆమె ఉపాధ్యాయులను కోరారు. తనను ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ సర్పంచ్ శ్రీ బి.ఎస్. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీమతి ఎన్. విమల వసుంధర దేవి గారు 2019 లో గడిగరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం గా బాధ్యతలు చేపట్టి పాఠశాల అభివృద్ధికి , విద్యార్థులు నమోదు పెంపునకు కృషి చేశారని ఆమె సేవలను కొనియాడారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జె. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి వంద శాతం ఉత్తీర్ణతకు కృషి చేయాలని ఆయన కోరారు. సమావేశంలో ఎంపీటీసీ సభ్యురాలు జక్కుల సావిత్రి, విద్యా కమిటీ చైర్మన్ వి. శ్రీనివాసులు ఉపసర్పంచ్ గోదాప్రసాద్ మాజీ విద్యా కమిటీ చైర్మన్ చింతల గోవిందరాజులు, ఉపాధ్యాయులు దస్తగిరమ్మ, నగిరి శ్రీనివాసులు , చంద్రావతి, రాంపుల్లారెడ్డి , మల్లికార్జున, కోమలమ్మ, పుష్ప కుమారి, ప్రతాపరెడ్డి , శ్రీరాములు , మారెన్న, కవిత, ప్రసన్న లక్ష్మి , లక్ష్మీదేవి, లలితమ్మ తదితరులు పాల్గొన్నారు.