విజయసాయి రెడ్డితో కలిసి పనిచేస్తా : ఆర్ఆర్ఆర్
1 min read
పల్లెవెలుగు వెబ్ : విజయసాయిరెడ్డిని ఢిల్లీకి పరిమితం చేయాలని జగన్ చూస్తున్నారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. విజయసాయి సేవలు ఢిల్లీలో ఉపయోగించుకునేందుకే.. ఆయనను విశాఖ నుంచి దూరం చేస్తున్నట్టు తెలుస్తోందని అన్నారు. పార్టీ, ప్రభుత్వం కోసం తాను, విజయసాయిరెడ్డి ఢిల్లీలో కలిసి పనిచేస్తామని చెప్పారు. పార్టీ కోసం, జగన్ కోసం పనిచేస్తానని రఘురామకృష్ణరాజు చెప్పడం ఇదే మొదటిసారి. దీంతో ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.