ప్రాణం నష్టం జరిగితే బాధ్యత వహిస్తారా..?
1 min readపల్లెవెలుగు, వెబ్ మిడుతూరు :మిడుతూరు మండల కేంద్రమైన పింజరి కాలనీలో మరియు మధు ఇంటి దగ్గర ఉన్న విద్యుత్ స్తంభాలు శిథిలావస్థలో ఉన్నాయని ఆ విద్యుత్ స్తంభాలు ఎప్పుడు పడిపోతాయో అని కాలనీవాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అదేవిధంగా ఎస్సీ కాలనీలో,రైతుల పొలాల్లో విద్యుత్ తీగలు,స్తంభాలు నేలకు ఒరిగి ఉన్నాయని వాటి వలన మనుషులకు,జంతువులకు ఏమైనా మరణం సంభవిస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని అంతేకాకుండా విద్యుత్ స్తంభాలు తొలగించాలని మరియు విద్యుత్ తీగలు సరిచేయాలని విద్యుత్ శాఖ అధికారి ఏఈ క్రాంతి కుమార్ కు ఎన్నిసార్లు విన్నవించినా కూడా వాటిని వేయటం లేదని కాలనీవాసులు మరియు సిపిఎం నాయకులు విద్యుత్ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.తదనంతరం తహసిల్దార్ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో తహసిల్దార్ సిరాజుద్దీన్ కు వినతి పత్రాన్ని అందజేసి సమస్య గురించి వారు ఆయనకు తెలియజేశారు.ఈకార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఓబులేసు,కెవిపిఎస్ మండల కార్యదర్శి లింగస్వామి కాలనీవాసులు అస్లాం,ఇస్మాయిల్, రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.