PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆధారాలతో వస్తే సహకరించడానికి సిద్ధమే

1 min read

సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దు

టీడీపీ నేత మాండ్ర శివానంద రెడ్డి.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: న్యాయపరంగా సంబంధిత పత్రాలతో వస్తే సహకరించడానికి తాను ఎప్పుడు సిద్ధమే అని నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంచార్జి మాండ్ర శివానందరెడ్డి పేర్కొన్నారు.తెలంగాణ పోలీసులు అరెస్టు చేసేందుకు సోమవారం మాండ్ర ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో మాండ్ర శివానంద రెడ్డి పరారీలో ఉన్నాడని సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించాయి. ఇందుకు సంబంధించి ఆయన ఒక వీడియో మీడియాకు విడుదల చేశారు. వీడియోలో ఆయన మాట్లాడుతూ ఉదయం నుండి వివిధ సోకాల్డ్ చానల్లలో వస్తున్న అవాస్తవాలను నమ్మాల్సిన అవసరం లేదన్నారు. సీసీఎస్ పోలీసులు రావడం వాస్తవం. కానీ వారు ఎలాంటి  వారెంట్ కానీ, నోటీస్ కానీ ఇవ్వకుండా మీరు హైదరాబాదుకు రండి అక్కడ దీనికి సంబంధించిన నోటీస్ లు ఇస్తామని చెప్పారన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఒక సామాన్య వ్యక్తిని సైతం నోటీస్ లేకుండా స్టేషన్లకు పిలిచే అధికారం లేదని పేర్కొన్నారు . సంబంధంలేని అక్యూస్డ్ గా , తన పేరు  కూడా  లేని  కేసులో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడం విడ్డురమని అన్నారు. సంబంధిత పత్రాలు ఏమి లేకుండా కొంతమంది నాయకుల మాటలు నమ్మి ఇలాచేయడం సమంజశం కాదని అన్నారు. సంబంధిత పత్రాలతో  వస్తే పోలీసు అధికారులకు అన్నివిధాల సహకరించడానికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని  నంద్యాల పార్లమెంటు టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి పేర్కొన్నారు. న్యాయవాదులు సైతం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితులలో అక్కడకు వచ్చిన అధికారులు లేకపోవడం గమనార్హమని పేర్కొన్నారు.

About Author