PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మళ్ళీగెలిపించండి..పులివెందుల చేస్తా..

1 min read

-అభివృద్ధిలో నాగలూటి మాదిరే మిగతా గ్రామాలు

-నియోజకవర్గం వైసీపీ అంటే  నందికొట్కూరు

-వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన శాప్ చైర్మన్, ఎంపీ

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో మళ్లీ భారీ మెజారిటీతో గెలిపిస్తే నందికొట్కూరు నియోజకవర్గాన్ని రెండో పులివెందుల గా చేస్తానని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నారు.గురువారం సాయంత్రం నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని నాగలూటి గ్రామంలో చేపట్టిన వివిధ పనులను ప్రారంభించడానికి సాయంత్రం 5 గంటలకు వచ్చిన ముఖ్య అతిథులుగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి,నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ధారా సుధీర్ హాజరయ్యారు.వీరికి గ్రామ సర్పంచ్ టి ఉషారాణి, గ్రామ వైసీపీ సీనియర్ నాయకులు సర్వేశ్వర్ రెడ్డి సహకార సొసైటీ చైర్మన్ నాగ తులసి రెడ్డి భారీ ఊరే గింపుగా ఘన స్వాగతం పలికారు.గ్రామంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు సిసి రోడ్లు పది లక్షలు,ఎంపీ నిధులతో పొలాలకు రహదారి 15 లక్షలు,మినరల్ వాటర్ ప్లాంట్ కు ఐదు లక్షలు,ఉపాధి హామీ పథకం నిధులు ఎస్సీ కాలనీకి సిసి రహదారి 5 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను సిద్ధార్థ రెడ్డి,ఎంపీ, సుధీర్ శిలా ఫలకాలను ప్రారంభించారు.తర్వాత ఏర్పాటు చేసిన సభలో సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ నాగలూటి గ్రామంలో ఎక్కడా కూడా జరగనంత అభివృద్ధి ఈ గ్రామంలో జరిగిందని నాగ తులసి రెడ్డి,సర్వేశ్వర్ రెడ్డి కుటుంబం ప్రజల కోసం అనునిత్యం కష్టపడుతూ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నారని పొగడ్తలతో ముంచె త్తారు.ఈ గ్రామం మాదిరే మిగతా గ్రామాల అభివృద్ధి కోసం నాయకులు కష్టపడాలని అన్నారు.ఈ గ్రామంలో దేవాలయ నిర్మాణం కోసం తన వంతుగా సహకారం అందిస్తానని అన్నారు. త్రాగునీటి సమస్యను తీర్చాలనే ఉద్దేశంతో పైపాలెం, నాగలూటి,49 బన్నూరు, దేవనూరు గ్రామాలలో బోర్లు వేయించామని వచ్చే ఎన్నికల్లో ఎంపీ ని ఎమ్మెల్యే ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. అంతేకాకుండా నందికొట్కూరు నియోజకవర్గం అంటే వైసీపీ పార్టీ అని..వైసీపీ పార్టీ అంటే నందికొట్కూరు నియోజకవర్గం అని సిద్ధార్థ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగనన్న ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చారో..ఆ విధంగా మీ గ్రామంలో మీకు ఇచ్చిన హామీలను పూర్తి చేశామని బరుడు సిద్ధార్థ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, మిడుతూరు జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి,వైస్ ఎంపీపీ టి. నబి రసూల్,వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి, మల్లు శివ నాగిరెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు ఫణి భూషణ్ రెడ్డి,నాగ స్వామి రెడ్డి, పేరెడ్డి వెంకటరామిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి,అలగనూరు చిన్న రామచంద్రారెడ్డి,సుంకేసుల రాముడు,మల్లేశ్వర రెడ్డి,సాదిక్ గోపాల్ రెడ్డి వివిధ గ్రామాల నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

About Author