PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డిని గెలిపించండి

1 min read

– ఎమ్మెల్సీ ఎన్నికల కై మండల వ్యాప్తంగా విస్తృత ప్రచారం
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : చెన్నూరు గ్రామము లోని 1వ, సచివాలయం పరిధిలోని తూర్పు హరిజన వాడ , మైనార్టీ కాలనీలలో మైనార్టీ నాయకులు వారిష్, హస్రత్ ఆధ్వర్యంలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గా వైఎస్ఆర్సిపి బలపరిచిన వెన్నపూస రవీంద్రారెడ్డికి పట్టబద్రులు మొదటి ప్రాధాన్యత వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది, అదేవిధంగా రెండవ సచివాలయ పరిధిలో మండల కన్వీనర్ జి ఎన్, భాస్కర్ రెడ్డి, టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, జేఏసీ కన్వీనర్ శ్రీనివాసరాజు, నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించడం జరిగింది, అదేవిధంగా మూడవ సచివాలయ పరిధిలో ఎంపీపీ చీర్లసురేష్ , మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చంద్ర ఓబుల రెడ్డి( బాబు) ఆధ్వర్యంలో కొత్త గాంధీ నగర్, అరుంధతి నగర్, తో పాటు కే ఓ ఆర్ కాలనీలలో పట్టభద్రులు తమ ఓటును వెన్నపూస రవీంద్ర రెడ్డికి వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రుల ఓటర్లను అభ్యర్థించడం జరిగింది, మండలంలోని కొండపేట, లో సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్, మాజీ ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, కిరణ్ ఆధ్వర్యంలో అదేవిధంగా రామనపల్లి, గ్రామాలలో రామన చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు విస్తృతంగా పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన MLC అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి కి ( 1) ప్రధమ ప్రాధాన్యత ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించ వలసిందిగా కోరుతూ ఎన్నికల ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది, అలాగే ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు, గ్రామ సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు బృందాలుగా ఏర్పడి ఆయా కాలనీలలో పాల్గొని గ్రాడ్యుయేట్ ఓటర్ల గృహాల వద్దకు వెళ్లి పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డికి ప్రథమ ఓటు వేసి, వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు, అదేవిధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ను వివరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో చెన్నూరు జడ్పిటిసి దిలీప్ రెడ్డి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, చెన్నూరు వైస్సార్సీపీ మండల కన్వీనర్ జియన్ భాస్కర్ రెడ్డి, సర్పంచ్ సిద్దిగారి వెంకటసుబ్బయ్య, వైఎస్ఆర్సిపి చెన్నూరు టౌన్ ఇంచార్జి ముదిరెడ్డి సుబ్బారెడ్డి, శ్రీనివాసరాజు, ఎర్ర సాని నిరంజన్ రెడ్డి, మైనార్టీ నాయకులు అన్వర్ భాష, అబ్దుల్ రబ్, గంగాధర్, వారిష్, సాదు కిషోర్ , డాక్టర్ చాన్ భాషా, జుమన్, ,వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు పాల్గొన్నారు.

About Author