PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిజాయితీతో ప్రశ్నించి పోరాడే నాయకులను గెలిపించండి

1 min read

– ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య జరిగే ఎన్నికలు
– పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించండి
– ఉద్యమ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయండి
– రాష్ట్రంలో జాడ లేని జాబ్ కాలెండర్
– రాష్ట్ర సిపిఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్రంలో ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య జరిగే ఎన్నికల్లో ఉద్యోగులు ఆత్మ గౌరవం కోసం ఓటు వేసి ఓటు ద్వారా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని రాష్ట్ర సిపిఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు .శుక్రవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజవర్గ పరిధిలోని జూపాడుబంగ్లా, పగిడ్యాల, మిడుతూరు మండల కేంద్రాలలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూల్, కస్తూరిబా గాంధీ, లక్ష్మాపురం అంచె వద్ద ఉన్న బాలయోగి గురుకుల పాఠశాలలో ఉద్యోగ, ఉపాధ్యాయ, సిపిఎస్ రద్దు కోసం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ కోసం, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు టైం స్కేల్, నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ కోసం పోరాటం చేసే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు లకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం దుర్మార్గమైన పాలన సాగిస్తోందని ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అధికార పార్టీ అభ్యర్థులే ఉండాలని చూస్తుందన్నారు.రాష్ట్రంలో డబ్బు, దౌర్జన్యాలతో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకోవాలని చూస్తున్నారని వారి కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగులు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని నాలుగేళ్ల కాలంలో నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ ఎలా ఉంటుందో తెలియదని సీఎం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో ప్రమాదకరమైన పాలన సాగుతోందని ఈ పాలనను అంతమొందించాలంటే మేధావులు ,పట్టభద్రులు ఆలోచించి పిడిఎఫ్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. రాష్ట్రంలో ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది అన్నారు ,ఉద్యోగులకు నెలనెలా జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. ఉద్యోగ ,ఉపాధ్యాయ కార్మికుల హక్కుల కోసం శాసనమండలిలో గొంతెత్తి మాట్లాడే పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. శాసనమండలిలో కత్తి నరసింహారెడ్డి లాంటి వివేకమంతమైన నాయకుడు లేరన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి రంగ నాయుడు , ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రమేష్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రఘురాం మూర్తి, జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు శ్రీనివాసులు, నందికొట్కూరు ఏఐఎస్ఎఫ్ నాయకులు దినేష్ ,మహానంది, వినోద్ , పగిడ్యాల ఏఐటీయూసీ నాయకులు చాంద్ బాషా, ఎన్ ఎస్ యు ఐ నాగ మధుయాదవ్, తదితరులు పాల్గొన్నారు.

About Author