స్కీమ్ వర్కర్ల జాతీయ సమ్మెను జయప్రదం చేయండి : ఏఐటియుసి
1 min readపల్లెవెలుగు వెబ్, ఆస్పరి : ఏపీ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్, మధ్యాహ్నభోజన కార్మికులు, ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత, పనికి తగ్గన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టే జాతీయస్థాయి సమ్మెను జయప్రదం చేయాలని ఏపీ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ తాలూకా నాయకురాలు విశాలాక్షి , ఏఐటియుసి తాలూకా కార్యదర్శి మునిస్వామి, మండల కార్యదర్శి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. మంగళవారం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏ పథకం అమలు చేసిన వాటిని ముందుండి నడిపించేది అంగన్వాడీ టీచర్స్ అండ్ ఆశావర్కర్ల ని, గత 45 ఏళ్లుగా అంగన్వాడీలతో వెట్టిచాకిరి చేయించుకుంటున్నారన్నారు. ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ పీఎఫ్,పెన్షన్, ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని, కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు సేవ చేసినటువంటి అంగన్వాడీ టీచర్స్ అండ్ ఆయా ఆశా కార్యకర్తలు పై ప్రభుత్వం చిన్నచూపు చూడటం తగదన్నారు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 20,000 రూపాయలు వేతనం ఇవ్వాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడులు రద్దు చెయ్యాలని ఈనెల 24వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీ టీచర్స్ అండ్ ఆయా ఆశ కార్యకర్తలు మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిట్టెమ్మ, ప్రేమిలా, పుష్పలత, సుభాన్, ఆరోగ్య మిత్ర తదితరులు పాల్గొన్నారు.