PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పి డి ఎఫ్ అభ్యర్థులను గెలిపించండి

1 min read

– సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు గౌస్ దేశాయి
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: నిరంతరం మనం ఎదుర్కొంటూ పోరాడుతున్న ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే, ప్రజాతంత్ర హక్కులు రక్షించబడాలంటే పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి గౌస్ దేశాయి పిలుపునిచ్చారు.సోమవారం గోనెగండ్ల మండల కేంద్రంలోని విజ్ఞాన్ డిగ్రీ కళాశాలలో యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి జి నరసింహులు అధ్యక్షతన జరిగిన ప్రజాసంఘాల సమావేశానికి ముఖ్య అతితులుగా హాజరైన సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షులు డి గౌస్ దేశాయి, కెవిపియస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యం డి ఆనంద్ బాబు లు మాట్లాడుతూ కేంద్రం లోను, రాష్ట్రం లోను, ప్రజల హక్కులకు ప్రధాన ఆటంకం కలుగుతున్న నేటి పరిస్థితుల్లో మన హక్కుల రక్షణ కై నికరంగా నిలబడి మాట్లాడే అభ్యర్థులను ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి, ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఉద్యోగానికి రాజీనామా చేసి, ఉద్యోగుల సమస్యలతో పాటు శ్రామిక వర్గ పోరాటాలకు, సామాజిక పోరాటాలకు అండగా నిలుస్తున్న పోతుల నాగరాజు పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల నాగరాజు, టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కత్తి నరసింహారెడ్డి లకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా ప్రతి ఓటరును కలవాలని, మార్చి 13 దాకా మరింత పట్టుదలతో కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈసమావేశంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఉపాధ్యక్షులు దండు కాజా, యుటిఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్శులు రామన్, చంద్రపాల్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బి కరుణాకర్, ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఖాజా, వీరన్న, పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి బతకన్న, స్కావెంజర్ వర్కర్స్ యూనియన్ నాయకులు దేవదాసు, డప్పు కళాకారుల సంఘం మండల అధ్యక్షులు మారేసు, కాటికాపరి గుంతలు తీసే బేగరుల సంఘం మండల నాయకులు రంగన్న, దేవరాజు, ప్రజా సంఘాల మండల నాయకులు బాబు, రామకృష్ణ, అక్బర్, జిక్రియ, ఉసేని లతో పాటు మరో 40 మంది పాల్గొన్నారు.

About Author