NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించండి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేస్తున్న పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పోతుల నాగరాజు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డిను గెలిపించాలని వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు కోరారు. మంగళవారం నందికొట్కూరు పట్టణంలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పీడీఎఫ్‌ అభ్యర్థి పోతుల నాగరాజు పేదల పక్షాన ఉంటూ నిత్యం ప్రజల కోసం పోరాడుతూ ఉద్యోగాన్ని సైతం వదులుకున్నారని గుర్తు చేశారు. అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యాకసా జిల్లా నాయకులు పక్కీర్ సాహెబ్, వెంకటేశ్వర్లు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author