NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించండి

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్న ప్రజా నాయకులు పిడిఎఫ్ తరఫున పోటీ చేస్తున్న పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల అభ్యర్థి పోతుల నాగరాజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్ ఆధ్వర్యంలో గ్రామాల్లో పిడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థుల తరఫున ప్రజా సంఘాల నాయకులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయాలు కేవలం ప్రజాసంఘాల నాయకులు మాత్రమే చేయగలరని, ఇప్పటికే శాసనమండలిలో అది రుజువైందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తే పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గొంతు విప్పి అడిగింది పిడిఎఫ్ ఎమ్మెల్సీలని, అదేవిధంగా తమ జీతభత్యాలను ప్రజా ఉద్యమ అవసరాల కోసం వెచ్చిస్తు, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న పిడిఎఫ్ అభ్యర్థులకు ఓటు వేయడం ద్వారా రాష్ట్రంలో పెరుగుతున్న అరాచక పాలన కు వ్యతిరేకంగా, అదేవిధంగా నిరుద్యోగ సమస్యపై, ఉద్యోగ, కార్మిక, యువజన, విద్యార్థి, మహిళల సమస్యల పరిష్కారం కై పోరాటాలకు బాసటగా నిలిచినట్లు అవుతుందని అన్నారు. కావున పట్టభద్రులు అందరు కూడా పోతుల నాగరాజుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, ఉపాధ్యాయ ఓటర్లు కత్తి నరసింహారెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author