అభివృద్ధి కావాలంటే టిడిపిని గెలిపించండి
1 min read– కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జ్ టీజీ భరత్
పల్లెవెలుగు, కర్నూలు
కర్నూల్లోని వార్డుల్లో సమస్యలు లేకుండా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కర్నూలు టిడిపి ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు 45, 46, 47, 48, 49 వార్డుల్లో ఆయన టిడిపి అభ్యర్థులను వెంటబెట్టుకొని ప్రచారం చేశారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి , కర్నూలు పార్లమెంట్ సాంస్కతిక విభాగం అధ్యక్షుడు హనుమంతు రావు చౌదరి, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ ప్రశ్నించే వారిని ఎన్నుకుంటేనే అభివృద్ధి పనులు చేయాలని పోరాడతారన్నారు. అధికార పార్టీకే అన్ని పదవులు ఇస్తే అభివృద్ధి జరగదన్నారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. టిడిపి అభ్యర్థులను గెలిపిస్తే సమస్య ఉందని సమాచారం ఇచ్చిన 15 నిమిషాల్లోపు స్పందిస్తారని హామీ ఇచ్చారు. ఇక ప్రజలందరూ తప్పకుండా ఓటింగ్‌లో పాల్గొనాలని కోరారు. అందరూ కలిసి ఓటు వేసి సరైన నాయకులను ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక ప్రపంచ మహిళా దినోత్సవం సందర్బంగా మహిళలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కార్పోరేటర్ అభ్యర్థులుగా తమ పార్టీ తరుపున మహిళలకు అవకాశం ఇచ్చామన్నారు. ప్రజలు గెలిపించుకొని మహిళలను ప్రోత్సహించాలన్నారు. ప్రచారంలో 45వ వార్డు అభ్యర్థి మాణిక్యమ్మ, 46వ వార్డు అభ్యర్థి సంజీవ లక్ష్మి, 47వ వార్డు అభ్యర్థి కల్యాణి, 48వ వార్డు అభ్యర్థి అమ్రీనా ఖాతూన్, 49వ వార్డు అభ్యర్థి విక్రమ్ సింగ్‌లు ఉన్నారు.