వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించండి
1 min read– వైసిపిలో భవిష్యత్ రోజులు యువతదే
పల్లెవెలుగు, వెబ్ నందికొట్కూరు: రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ సత్తా చాటాలని త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం ఎంతో కీలకమని కౌన్సిలరు కాటేపోగు చిన్న రాజు అన్నారు.రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం పట్టణంలోని ఒకటోవ వార్డు ఏబీఎం పాలెంలో ఆయన పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ పై పట్టభద్రులకు కరపత్రాలు పంపిణీ చేస్తూ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ సిపిలో యువత కు పెద్దపీట వేయనున్నట్లు ఆయన చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు లక్షల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారని గుర్తు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రైతులు, యువకులు, ముస్లిం మైనారిటీల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద మొత్తంలో ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు.ఈ నెల 9వ తేదీలోపు ఓటు హక్కును నమోదు చేసుకుని రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రులు వారి అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును వైఎస్ఆర్ సిపి అభ్యర్థి వెన్నపూస రవీంద్ర రెడ్డి కి వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని అభ్యర్థించారు. పలువురు పట్టభద్రులు పాల్గొన్నారు.