NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వెన్నపూస రవీంద్రారెడ్డిని గెలిపించండి:వైసీపీ

1 min read

పల్లెవెలుగు వెబ్​, చెన్నూరు: చెన్నూరు గ్రామము లోని కొత్త గాంధీ నగర్, అరుంధతి నగర్, తో పాటు మండలంలోని కొండపేట, అదేవిధంగా  రామనపల్లి, గ్రామాలలో శుక్రవారం సాయంత్రం వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులు విస్తృతంగా  పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన MLC అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి కి ( 1) ప్రధమ ప్రాధాన్యత ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించ వలసిందిగా కోరుతూ   ఎన్నికల ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది , ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలు, గ్రామ సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు బృందాలుగా ఏర్పడి ఆయా కాలనీలలో పాల్గొని గ్రాడ్యుయేట్ ఓటర్ల గృహాల వద్దకు వెళ్లి పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డికి ప్రథమ ఓటు వేసి, వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు, అదేవిధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ను వివరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో చెన్నూరు జడ్పిటిసి దిలీప్ రెడ్డి, వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, చెన్నూరు వైస్సార్సీపీ మండల కన్వీనర్ జియన్ భాస్కర్ రెడ్డి, సర్పంచ్ సిద్దిగారి వెంకటసుబ్బయ్య, వైఎస్ఆర్సిపి చెన్నూరు టౌన్ ఇంచార్జి ముదిరెడ్డి సుబ్బారెడ్డి, శ్రీనివాసరాజు, ఎర్ర సాని నిరంజన్ రెడ్డి, సత్యరాజు వైస్సార్సీపీ యువ నాయకులు TN చంద్రారెడ్డి , పాలగిరి ఉమామహేశ్వర్ రెడ్డి , ST సెల్ శ్రీనివాసులు, జకరయ్య వైఎస్ఆర్సిపి నాయకులు తో పాటు కొండపేట వైఎస్ఆర్సిపి నాయకులు ఎంపీటీసీ దుంప నాగిరెడ్డి, సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్, మాజీ ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, కిరణ్ వైయస్సార్ సిపి నాయకులు పి సి కేశవరెడ్డి, కార్యకర్తలు సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు   పాల్గొన్నారు.

About Author