PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గాలి వాన.. బీభత్సం..

1 min read

– అల్వాలలో సోలార్​ ప్లాంట్​ ధ్వంసం
పల్లెవెలుగు వెబ్​, గోనెగండ్ల: గోనెగండ్ల మండలంలో మంగళవారం రాత్రి, బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలో ఎక్కడా భీభత్సం సృష్టించకపోయినా.. అల్వాల గ్రామంలో రైతు ప్రకాష్​ తన పొలంలో వేసుకున్న సోలార్​ ప్లాంట్​ ధ్వంసమైంది. గత ప్రభుత్వంలో మంజూరైన సోలార్ విద్యుత్ ప్లాంట్ చిన్న సన్నకారు రైతులలో వెలుగులు నింపిందని, ప్రస్తుతం కురిసిన భారీ వర్షానికి సోలార్ విద్యుత్ ధ్వంసం అయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. సోలార్​ విద్యుత్​ ప్లాంట్​ విలువ రూ. లక్ష ఉంటుందని, రైతు ప్రకాష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరారు.


About Author