విండోస్ 11.. కొత్త ఫీచర్స్ తో అదరగొట్టింది !
1 min readపల్లెవెలుగు వెబ్: మైక్రో సాఫ్ట్ సీఈవో గా బాధ్యతలు తీసుకున్నాక.. మైక్రోసాప్ట్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ని మార్కెట్ లోకి తెచ్చింది. అదరగొట్టే ఫీచర్లతో.. మునుపెన్నడూ లేని విధంగా కొత్త ఓఎస్ ను తీర్చిదిద్దారు. వచ్చే పదేళ్ల వరకు వినియోగదారుల అవసరాలు తీర్చేందుకు ఈ ఓఎస్ ను తెచ్చినట్టు సత్యనాదెళ్ల తెలిపారు. విండోస్ చరిత్రలో ఇదే పెద్ద మైలు రాయి అని సత్య నాదెళ్ల అన్నారు.
కీలక ఫీచర్లు :
- విండోస్ 11లో స్టార్ట్ మెనూను ఎడమవైపు నుంచి సెంటర్ కు తీసుకొచ్చారు. స్టార్ట్ బటన్ క్లిక్ చేయగానే.. యాప్స్ లిస్ట్ స్క్రీన్ సెంటర్ లో పాప్ అప్ అవుతుంది.
- కొత్త ఓఎస్ లో లైవ్ టైల్స్ స్థానంలో రౌండెడ్ కార్నర్స్ తో యాప్ ఐకాన్స్ తీసుకొచ్చారు.
- కొత్త ఓఎస్ లో స్నాప్ లేఅవుట్స్ తీసుకొస్తున్నారు. స్క్రీన్ పై ఫోల్టర్, యాప్స్, సాఫ్ట్ వేర్ లను కావాల్సినట్టు అరేంజ్ చేసుకోవచ్చు. దీని కోసం ఢీపాల్ట్ గా ఆరు రకాలుగా లే అవుట్స్ ఇస్తున్నారు. మల్టీ టాస్కింగ్ చేసే వారి కోసం ఇది బాగా పనిచేస్తోంది.
- ఐవోఎస్, ఆండ్రాయిడ్ మైబైల్స్ తరహాలో కొత్తగా సెర్చ్ డాక్యుమెంట్ ఫీచర్స్ తీసుకొస్తున్నారు. అంటే సెర్చ్ లో యాప్స్, సాప్ట్ వేర్ తో పాటు డాక్యుమెంట్స్ కూడ కనిపిస్తాయి. ఇది మైక్రో సాఫ్ట్ 365 వినియోగదారులకు ఉపయోగకరంగా ఉంటుంది.
- విండో స్ లో అప్ డేట్ వచ్చిన ప్రతిసారి.. రిస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి సిస్టమ్ నాలుగైదు సార్లు రీస్టార్ట్ అవుతోంది. విండోస్ 11లో అలాంటి సమస్యలు ఉండవు. బ్యాంక్ గ్రౌండ్ లో అప్ డేట్ అవుతాయి.
- కొత్త ఓఎస్ లో ఆటో హెచ్ డీఆర్ ఫీచర్ ఉంటుంది. ఎక్స్ బాక్స్ లో గేమ్స్ ఆడేవారికి ఇదే కొత్త అనుభూతి ఇస్తుందట. ల్యాపీలు, హెడీ మానిటర్లు ఉన్న పీసీల్లో గేమింగ్ అనుభూతి కొత్తగా ఉంటుంది.
- అమెజాన్ యాప్ స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ ఆధారిత యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
- నవంబర్ నుంచి విండోస్ 11 అందుబాటులో ఉంటుంది. విండోస్ 10 యూజర్లకు ఉచితంగా అప్ డేట్ చేస్తారు. కొత్తగా విండోస్ 11ఇన్ స్టాల్ చేయాలనుకుంటే డబ్బులు చెల్లించాలి.