1500 ఏళ్ల కిందటి వైన్ ఫ్యాక్టరీ !
1 min readపల్లెవెలుగు వెబ్: ఇజ్రాయిల్ దేశంలో 1500 ఏళ్ల నాటి వైన్ ఫ్యాక్టరీ వెలుగులోకి వచ్చింది. గ్రీకు రాజు బైజాంటైన్ కాలం నాటి మద్యం ఫ్యాక్టరీగా దీనిని గుర్తించారు. టెల్ అవీవ్ కు దక్షిణం వైపు ఉన్న యావ్నే పట్టణ సమీపంలో ఇది బయటపడింది. సుమారు 1500 ఏళ్ల కిందట ఇక్కడ భారీస్థాయిలో మద్యం తయారు చేసినట్టు పరిశోధకులు గుర్తించారు. మొత్తం ఐదు మద్యం తయారీ యూనిట్లు, గిడ్డంగులు, మట్టిపాత్రలు నిల్వ ఉంచే బట్టీలు, వేల సంఖ్యలో జాడీలు, వాటి శకలాలను వెలికితీశారు. వీటి ఆధారంగా యావ్నేలో ఏటా 5.2 లక్షల గాలన్ల పైగా మద్యం తయారయ్యేదని అంచనా వేశారు.