వంటనూనె ధరలకు రెక్కలు.. కారణం ఇదే !
1 min readపల్లెవెలుగువెబ్ : నిత్యావసర ధరలు పెరగడంతో ఇప్పటిటే సామాన్యులు అల్లాడుతండగా.. మూలిగే నక్కపై తాటిపడ్డ చందంగా వంట నూనె ధరలు భగ్గుమంటున్నాయి. 15 రోజుల వ్యవధిలోనే ధరలు లీటరుపై రూ.30 నుంచి రూ.40 వరకు పెరిగాయి. దీంతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి దిగుమతి అయ్యే సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతి కాకపోవడంతో పామాయిల్‌కు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రంలో పామాయిల్ వాడకం ఎక్కువ కావడంతో వీటి ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో వంటనూనెను కొనుగోలు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. యుద్ధాన్ని ఆసరాగా చేసుకుని వ్యాపారస్తులే కావాలని కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.