బీర్ల ధరకు రెక్కలు.. ఆ రెండు దేశాలే కారణమా ?
1 min readపల్లెవెలుగువెబ్ : చాలా రాష్ట్రాలు బీర్ల ధర పెంపునకు సిద్ధమయ్యాయి. బీర్ల ధర పెంపునకు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. బీర్ల తయారీలో అవసరమైన ముఖ్యమైన ముడి పదార్థం బార్లీ. బార్లీ ఎక్కువగా రష్యా, ఉక్రెయిన్ నుంచి దిగుమతి అవుతోంది. ప్రస్తుతం ఆ ఇరు దేశాల మధ్య నెలకొన్న యుద్ధం కారణంగా బార్లీ దిగుమతి క్షీణించినట్లు చెబుతున్నారు. దీంతో బీర్ల తయారీకి ఖర్చు పెరిగిందని ధర పెంచుకోవడానికి నిర్ణయించాయి. ఇప్పటికే మద్యం అధిక ధరల వల్ల మందుబాబుల జేబుకు చిల్లు పడుతోంది. ఇప్పుడు బీర్ల ధరలు పెరిగితే లబోదిబోమనడం ఖాయం. ఒక్కో బీరు పై రూ. 5 నుంచి రూ. 10 పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.