బంగారం ధరకు రెక్కలు !
1 min read
పల్లెవెలుగు వెబ్ : బంగారం ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ పెరగడంతో భారత్ లో బంగారం ధరలు పెరిగాయి. గురువారం నాటి బులియన్ ట్రేడింగ్ లో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర 526 పెరిగి.. 46,310కి చేరింది. రూపాయి బలహీనపడటం కూడ బంగారం ధరల పెరుగుదలకు కారణమని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. బుధవారం 10 గ్రాముల బంగారం ధర 45,784 వద్ద ముగిసింది. వెండి కూడ బంగారం బాటలో నడిచింది. గురువారం 1231 రూపాయలు పెరిగి 68,654కు చేరింది.