అత్యవసర మందుల ధరలకు రెక్కలు
1 min readపల్లెవెలుగువెబ్ : పారాసెటమాల్‌తో సహా 800 అత్యవసరమైన మందుల ధరలు ఏప్రిల్ నుంచి 10.7శాతం పెరగనున్నాయి. మెజారిటీ సాధారణ జబ్బులకు చికిత్స చేయడానికి ఉపయోగించే నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్‌లో దాదాపు 800 షెడ్యూల్ చేసిన మందుల ధరలు ఏప్రిల్ 1 నుంచి 10.7 శాతం పెరగనున్నాయి. వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు కార్యాలయం అందించిన డేటా ఆధారంగా మందుల ధరలు పెంచినట్లు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నోటీసులో పేర్కొంది.